కోలీవుడ్ నటుడు కార్తీ అంటే తెలుగువారికి కూడా సుపరిచితుడే. ఈయన చేసే సినిమాలు ఎన్నో తెలుగులో కూడా వచ్చి టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే అలాంటి కార్తి తన రంజనిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక పెళ్లికి ముందు కార్తిహీరోయిన్ ని ప్రేమించారు.కానీ అది వర్కౌట్ కాలేదని,కార్తీ తండ్రి ఒప్పుకోకపోవడంతో హీరోయిన్ ని వదిలేసి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఓకే చేశాడనే వార్తలు వినిపించాయి. అయితే కార్తీ ప్రేమించిన హీరోయిన్ అనగానే ఎక్కువ వినిపించే పేరు తమన్నా.గతంలో కార్తీక్ తమన్నా ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారని పెళ్లికి కూడా రెడీ అయ్యారు అని, కార్తీ తమన్నా మీద ప్రేమతో ఆమెకు ఫ్లాట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టు రూమర్లు వినిపించాయి. 

అయితే తమన్నా కార్తి కాంబోలో రెండు మూడు సినిమాలు వచ్చేసరికి వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని అందరూ అనుకున్నారు.అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కార్తి తన భార్య హీరోయిన్ల విషయంలో వార్నింగ్ ఇచ్చింది అంటూ సంచలన విషయం చెప్పారు. కార్తి మాట్లాడుతూ..నాకు హీరోయిన్ తమన్నాతో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు రాశారు. అయితే ఆ రూమర్లను నేను ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే అవి రూమర్లుగానే మిగిలిపోతాయి కాబట్టి వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ఇక హీరోయిన్లతో రొమాన్స్ చేసే విషయంలో మా ఆవిడ నాతో చాలా సార్లు వాదించి నాకు వార్నింగ్ లు కూడా ఇచ్చింది.వారిని టచ్ చేయకుండా ఉండలేవా అని తిట్టింది. 

కానీ హీరోయిన్స్ ని టచ్ చేయకుండా రొమాన్స్ ఎలా చేయగలరు. ఈ విషయం ఆమె కాస్త లేటుగా గ్రహించింది. ఓ రోజు సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకి వచ్చి కూర్చుంది.ఆ టైంలో రొమాంటిక్ సీన్స్ వస్తే కచ్చితంగా హీరోయిన్ ని టచ్ చేయాల్సి ఉంటుంది.ఇక లైవ్లో చూసేసరికి హీరోయిన్లను టచ్ చేయకుండా రొమాన్స్ చేయడం అసాధ్యం కదా అని అప్పటినుండి హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలను కూడా పట్టించుకోవడం లేదు అంటూ తన భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కార్తీ. అయితే గతంలో తమన్నా కార్తి మధ్య ఉన్న ప్రేమ కార్తి భార్యకు తెలిసి తమన్నా ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చినట్టు రూమర్లు వినిపించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: