తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె నటించిన తెలుగు మూవీలు వరుసగా ఫ్లాప్ లను అందుకున్నాయి. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. దానితో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా పోయిన సంవత్సరం విడుదల కాలేదు. ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తుంది.

తాజాగా పూజా హెగ్డే నటించిన దేవా అనే హిందీ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ నటులు దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలోనూ , సూర్య హీరోగా రూపొందుతున్న మరో సినిమాలోని హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కాంచన 4 మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ , మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ డిమాంటి కాలనీ సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందబోయే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లు వెబ్ సిరీస్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ అద్భుతమైన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సమయంలో పూజా హెగ్డే వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు రావడంతో ఈ ముద్దుగుమ్మ పెద్ద డేరింగ్ డెసిషన్ తీసుకుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: