ఈ మధ్య కాలంలో 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు చాలానే వచ్చాయి. 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్న సినిమాలో హీరోగా హీరోయిన్గా నటించిన వారికి ఏ స్థాయిలో క్రేజ్ వస్తూ ఉంటుందో , అలాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వారికి కూడా అదే రేంజ్ లో గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇక వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించే స్థాయి మూవీలను రూపొందించాడు అంటే ఆ దర్శకుడికి వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ 1000 కోట్ల సినిమాకు దర్శకత్వం వహించిన ఓ దర్శకుడి సినిమా మాత్రం ఆగిపోయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు ఆ దర్శకుడు ఎవరు ..? ఎవరితో సినిమా అనుకుంటే ఆగిపోయింది అనే వివరాలను తెలుసుకుందాం.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ అందులో ఒక్క సినిమా కూడా అపజయం సాధించలేదు. ఇలా అట్లీ దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తో కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత ఈయన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఆల్మోస్ట్ అంతా సెట్ అయింది అనే తరుణంలో ఈ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అట్లీ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు ఈ మధ్య కాలంలో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి అట్లీ తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: