
రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న శ్రీరెడ్డి .. అదే సమయంలో చంద్రబాబు , పవన్ , లోకేష్ ఆ పార్టీ నేతలను టార్గెట్గా చేస్తూ తీవ్ర విమర్శలు ఆరోపణలతో సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టింది .. అదే క్రమంలో వైయస్ జగన్ ను దైవంలా పొగుడుతూ వ్యాఖ్యలు చేసేది .. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా .. కూటమీ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి .. గత ప్రభుత్వంలో కూటమి నేతలపై సోషల్ మీడియాలో దూషణలు ఆరోపణలు తిట్లు చేసిన వారిపై ఒక్కొక్కటిగా కేసులు నమోదు కావటం ప్రారంభమైంది .. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు .. కానీ ఆమె వెనక్కి తగ్గింది .. దీంతో కూటమి కూడా ఆమెను వదిలేసింది.
అయినా కూడా శ్రీ రెడ్డి లో భయం తగ్గలేదు .. ఒకవైపు సోషల్ మీడియాలో విడియోలు చేస్తూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది .. వైజాగ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆమెపై నమోదు అయిన కేసుల్లో అరెస్టు కాకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ దాకలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు. ఆమెకు కీలక ఆదేశాలు జారీ చేసింది . విశాఖపట్నంలో నమోదైన కేసుల్లో శ్రీ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది .. అలాగే కర్నూల్ , కృష్ణ , విజయనగరం జిల్లాలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి విచారణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది .. అలాగే చిత్తూరు జిల్లాలో పెట్టిన కేసులపై మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది.