బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న హీరోలలో కొంత మంది కోలీవుడ్ దర్శకుల సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజిని అనే సినిమాలో హీరోగా నటించాడు.

అప్పటికే గజినీ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో అద్భుతమైన విజయం అందుకుంది. అలా తమిళ్ , తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న గజిని మూవీ ని అమీర్ ఖాన్ హిందీ లో రీమిక్ చేశాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమీర్ ఖాన్ క్రేజ్ మరింతగా పెరగాగ మురగదాస్ కి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను కూడా వసూలు చేసింది.

ఈ సినిమాతో షారుక్ ఇమేజ్ మరింతగా పెరగగా , అట్లీ కి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ కూడా వీరిద్దరి రూట్ లోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి అత్యంత ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: