కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేసేవారు కాదు. అందుకు ప్రధాన కారణం స్టార్ స్టేటస్ ఉన్న సమయంలో సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసినట్లయితే ఆ తర్వాత సినిమాల్లో వారికి హీరోయిన్ పాత్రల్లో అవకాశాలు రావు అని , కేవలం ఐటెం పాటలలో మాత్రమే అవకాశాలు వస్తాయి అని చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఐటమ్ పాటలకు చాలా దూరంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం స్టార్ హీరోయిన్స్ ఐటం పాటలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఐటమ్ పాటల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే అదిరిపోయే రేంజ్ ఉన్న కొంత మంది హీరోయిన్స్ స్టార్ స్టేటస్ ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్స్ లలో నటించిన కూడా కేవలం ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ తో ఆపేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న సమయంలో జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత కాజల్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతున్న సమయంలో అనుష్క స్టాలిన్ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత అనుష్క ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. సమంత కూడా స్టార్ స్టేటస్ ఉన్న సమయంలో పుష్ప పార్ట్ 1 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఆ తర్వాత సమంత ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: