
అయితే ఇదే సమయంలో 2021లో పుష్ప సినిమా విడుదలై బాలీవుడ్ ఆడియన్స్ ను సూపర్ హిట్ గా ఆకట్టుకుంది. అప్పుడు ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది . పుష్ప1 సక్సెస్ అవ్వడానికి గోల్డ్ మై టెలిఫిలిమ్స్ మనీష్ షా అక్కడ కీలకంగా వ్యవహరించారట. అయితే పుష్ప 2 సినిమా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయలేదట. దీంతో ఈ సినిమా పైన ముందు నుంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఎందుకు తీసుకోలేకపోయారు అనే విషయం పైన చాలా ఊహాగానాలు కూడా వినిపించాయట.
పుష్ప మొదటి భాగం హిందీ హక్కులు రూ.30 కోట్లకు మనిషా కొనుగోలు చేశారట. దీంతో భారీ లాభాలను అందుకున్న ఆయన.. ఆ తర్వాత నిర్మాతలు వచ్చి ఆదాయంలో కూడా వాటా కూడా అడిగినట్లు వార్తలు వినిపించాయి. అందుకు మనీష్ మాత్రం ఒప్పుకోలేదని, ఆ తర్వాత అనిల్ తడాని పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్ హక్కులను సైతం రూ.200 కోట్లకు కొనుగోలు చేశారట. అయితే ఇప్పుడు మనీష్ భారీ లాభాలు మిస్ అయ్యారని కొంతమంది నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తూ ఉండగా.. ఆ సమయంలోనే మనీష్ షా తీసుకొని ఉంటే మరింత లాభం వచ్చేదని అభిమానులు అభిప్రాయంగా తెలుపుతున్నారు. మొత్తానికి పుష్ప 2 చిత్రంతో భారీ లాభాలను మిస్సయ్యారు.