టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలో విలన్ గా నటించిన ఆదిత్య మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య మీనన్ తన ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
ఒకవైపు మాస్ విలన్ రోల్స్ లో మరోవైపు క్లాస్ విలన్ రోల్స్ లో నటిస్తూ ఆదిత్య మీనన్ తన పాపులారిటీని పెంచుకున్నారు. మిర్చి, బిల్లా, పుష్ప సినిమాలలో సైతం ఆయన మెరిశారు. ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య మీనన్ మాట్లాడుతూ హీరోలకు ఎక్కువ బాధ్యత ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే హీరోగా ఆఫర్లు వచ్చినా నేను వదిలేసుకున్నానని ఆదిత్య మీనన్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
అందుకే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆదిత్య మీనన్ పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన రోల్స్ అన్నీ చేసుకుంటూ కెరీర్ ను కొనసాగించానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నాకు సూట్ అయ్యే రోల్స్ ను ఎంచుకోవడం జరిగిందని ఆదిత్య మీనన్ వెల్లడించారు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని ఆదిత్య మీనన్ పేర్కొన్నారు.
 
నేను దేశ విదేశాలు తిరుగుతూ ఉంటానని ఆయన వెల్లడించారు. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్రదేశాలకు వెళ్తున్నానని ఆదిత్య మీనన్ అన్నారు. గుర్రపు మాంసం, పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నానని ఆదిత్య మీనన్ వెల్లడించారు. ఆదిత్య మీనన్ కు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. నటుడు ఆదిత్య మీనన్ యాక్టింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆదిత్య మీనన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆదిత్య మీనన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: