హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైనది శివరాత్రి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు ఈ పండుగ వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.ఈ రోజు శివభక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, రోజంతా శివనామస్మరణ చేస్తారు. శివున్ని అభిషేకించడంతో పాటు బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేస్తుంటారు. ఇదిలావుండగా ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26, బుధవారం నాడు వచ్చింది. చతుర్దశి తిథి ఆరోజు ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 27న ఉదయం 8:54కి ముగుస్తుంది.అయితే, కొంతమంది మాత్రం శివపార్వతుల పెళ్లి ఫిబ్రవరి లేదా మార్చిలో కాకుండా మార్గశిర మాసంలోనవంబర్-డిసెంబర్ జరిగిందని అంటారు. మహాశివరాత్రి జరుపుకోవడానికి రెండో కారణం శివుడి తాండవం.మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు. ఈ తాండవం సృష్టి, స్థితి, లయలకు సంకేతం. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు. జీవిత చక్రం, కాలగమనం.ఇలా అన్నింటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది.

ఇదిలావుండగా మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని చెబుతారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు.ఈ సందర్భంగా శివుని భక్తి పారవశ్యంలో ముంచెత్తే పాటలలో కొన్ని చూసుకుందాం.జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి కనెక్టైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే.   జనన మరణాలు, పంతం-అంతం, ప్రళయం-ప్రణయం, నలుపు-తెలుపు , మన్ను-మిన్ను లాంటి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచనకు ఏసుదాసు స్వరం తోడైంది.అలాగే చావుకి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే.. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలోది.

అలాగే బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు..అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే సాంగ్  ఇది.. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోది.అదేవిధంగా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేస్తుంది.నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపూ..ఆ తర్వాత నువ్వు దేవుడివి-నేను అంటరానివాడిని , నీ కాలు కిందపెట్టకుండా ఉండేలా నిన్ను గర్భగుడికి చేర్చాను కానీ నీ గుడిలో నన్ను అడుగుపెట్టనివ్వవు, నీ ముందు వెలిగే దీపాల కోసం నేను చెమటడోచ్చాను కానీ మా కొడిగట్టిన బతుకులు మార్చవెందుకు అన్న ఓ శిల్పి ఆవేదన ఆవిష్కరించిన ఈ పాటకు రచన, సంగీతం, గానం అన్నీ చరణ్ అర్జున్.అలాగే ట్రెండ్ తగ్గట్టుగా ఇప్పటి జనరేషన్ ని అట్రాక్ట్ చేసేలా రూపొందించిన హర హర శంభో సాంగ్  అదిరిపోయేలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: