
ఇక కథ నచ్చడంతో నాని కూడా ఓకే చెప్పాడట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మరి మున్ముందు ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ క్రమంలోనే తమిళంలోనూ హీరోగా తన లక్‌ను పరీక్షించుకున్నాడు నాని. రెండు సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. వెప్పం మూవీతో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అంజనా అలీఖాన్ దర్శకత్వం వహించింది.ఈ మూవీలో నిత్యామీనన్, బిందుమాధవి హీరోయిన్లుగా నటించారు. సెగ పేరుతో తెలుగులోకి వెప్పం మూఈ డబ్ అయ్యింది. ఈ సినిమా రెండు భాషల్లో డిజాస్టర్‌గా మిగిలింది. వెప్పం సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మించడం గమనార్హం.ఆ తర్వాత ఆహా కళ్యాణం పేరుతో మరో తమిళ సినిమాలో హీరోగా నటించాడు నాని.