
అయితే రీసెంట్గా రష్మిక మందన్నాకి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా అనిమల్ సినిమా షూటింగ్ టైంలో ఆమె ఫుడ్ వల్ల ఎంత ఇబ్బంది పడింది అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. షూటింగ్ సెట్స్ లో పెట్టే ఫుడ్ తన బాడీ కి సరిపడలేదట . దానివల్ల చాలా ఇబ్బందులు పడిందట . మరి ముఖ్యంగా డైట్ కంట్రోల్ సరిగ్గ లేకపోవడం వల్ల పూర్తిగా హెల్త్ కండిషన్ కూడా బాగా దెబ్బతినిందట . అదే మూమెంట్లో కమిట్ అయిన కాల్ షీట్స్ ఒకసారి వదులుకుంటే మళ్లీ కష్టమంటూ హెల్త్ బాగో లేకపోయినా అనిమల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నిందట.
అయితే ఫుడ్ అస్సలు నచ్చలేదట. ఈ క్రమంలోనే ఫుడ్ తినలేక కార్ వ్యాన్ లో బాధపడిపోతున్న రష్మిక మందన్నా.. ప్రాబ్లం తెలుసుకున్న రన్బీర్ కపూర్ పక్క రోజు నుండి స్వయంగా తన చెఫ్ తో మాట్లాడి రష్మిక మందన్నాకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసుకొని అదే ఫుడ్ ని అనిమల్ షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు కూడా ఆమెకు స్పెషల్ గా ఇంటి నుండి క్యారియర్లు తీసుకొచ్చారట. రష్మిక మందన్నా చాలా ఎమోషనల్ గా కూడా ఫీలయ్యిందట . అంతేకాదు ఒక ఇంటర్వ్యూ లో ఇది బయటపెట్టింది. " ఎంతో మంది హీరోలతో వర్క్ చేశాను అని రన్బీర్ కపూర్ లాంటి హీరోలు చాలా రేర్ గా ఉంటారు అని డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని ..అందుకే ఆయన ఇంత పెద్ద స్టార్ అయ్యాడు అంటూ చాలా చాలా గట్టిగానే పొగిడేసింది". దానికి సంబంధించిన వార్తను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మొత్తానికి రష్మిక కోరికను అలా తీర్చేసాడు రణబీర్ కపూర్ అంటూ కొందరు డబల్ మీనింగ్ లో రష్మిక ను ట్రోల్ చేస్తున్నారు..!