సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సందర్భాలలో ఒక ఫార్ములాతో అద్భుతమైన విజయాలు దక్కితే , కొంత కాలం తర్వాత ఆ ఫార్ములాను ఫాలో అయిన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఒక విషయంలో అదే జరుగుతుంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? కొన్ని సంవత్సరాల క్రితం రీమిక్ సినిమాల ట్రెండు జోరుగా కొనసాగింది. ఏదైనా భాషలో ఒక సినిమా వచ్చి అది మంచి టాక్ ను తెచ్చుకుంది అంటే చాలు వెంటనే ఆ సినిమా రైట్స్ కోసం భారీ పోటీ ఉండేది. ఆ మూవీ యొక్క హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి ఇతర భాషలలో రీమిక్ చేసేవారు.

అలా ఒక భాషలో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లో రీమిక్ చేసిన సందర్భాలలో ఎక్కువ శాతం సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఆ హిట్ ఫార్ములా చాలా వరకు ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. దానికి ప్రధాన కారణం ఒకప్పుడు సినిమాలను కేవలం థియేటర్లలో , ఆ తర్వాత చాలా కాలానికి బుల్లి తెరపై ప్రేక్షకులు చూసేవారు. కానీ ప్రస్తుతం సినిమా విడుదల అయ్యింది అంటే కొంత కాలానికి ఆ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది. దానితో ఆ సినిమా ఒకే భాషలో అందుబాటులో ఉన్న సబ్ టైటిల్స్ తో ఆ సినిమాని అనేక మంది చూసేస్తున్నారు.

ఇక అలా చాలా మంది జనాలు చూసిన సినిమా యొక్క రైట్స్ ను కొని ఆ మూవీ ని రీమిక్ చేసిన వాటికి పెద్దగా జనాల నుండి ప్రశంసలు రావడం లేదుం దానితో ఈ మధ్య కాలంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసిన వాటికి అపజయాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఒకానొక సమయంలో అద్భుతమైన హిట్ ఫార్ములా గా ఉన్న రీమిక్ ఫార్ములా ప్రస్తుతం మాత్రం మేకర్స్ కి ఎక్కువ శాతం ఫ్లాప్స్ ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: