పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి నిర్మాత నటుడు అయినటువంటి బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పై కొన్ని కౌంటర్లు,సెటైర్లు వేస్తున్నాడు.అయితే దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ మధ్య దూరం పెంచుతున్నాడనే కోపంతోనే లేనిపోని మాటలు చెప్పి త్రివిక్రమ్ తనతో పవన్ కి ఉన్న బంధాన్ని చెడగొడుతున్నారని త్రివిక్రమ్ పై చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని గెలికారు బండ్ల గణేష్.. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశారు.'కొందరితో మన సంబంధాలు అద్దె ఇల్లు లాగే ఉంటాయి.. 

ఎందుకంటే మనం వారితో ఎంత ప్రేమగా మసులుకున్నా.. ఇంత నిజాయితీగా ఉన్న వాళ్లు ఎప్పటికీ మనవాళ్లు కాలేరు' అంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్స్ బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించేనని కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని దేవుడిలాగా బండ్ల గణేష్ ఎంతలా ఆరాధించినా కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉండేవాళ్ళు మాత్రం బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెంచుతున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ ని ఎంత ఆరాధించినా ఎంత ప్రేమించినా కూడా తనని దగ్గరకు తీసుకోవడం లేదని ఎప్పటికీ పవన్ కి దగ్గర అవ్వడం లేదనే ఉద్దేశంతోనే ఇలా అద్దె ఇల్లు లాంటిది అంటూ బండ్ల గణేష్  ట్వీట్ చేశారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. 

ఇక బండ్ల గణేష్ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్స్  పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బండ్ల గణేష్ ని దగ్గరికి తీసుకుంటే మంచిదని,ఆయన ఆవేదనను కాస్తయినా అర్థం చేసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ల మధ్య బంధం గబ్బర్ సింగ్ నుండి ఏర్పడింది. గబ్బర్ సింగ్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిర్మాతగా రాణించారు. ఆ తరువాత తీన్మార్ మూవీ చేసినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: