టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయాలను అందుకున్నాయి. ఈయన కొంత కాలం క్రితం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన చాలా సినిమాల్లో నటించిన ఏ మూవీ స్థాయి విజయాన్ని మాత్రం ఈయన అందుకోలేదు.

ఇకపోతే తాజాగా సందీప్ , కిషన్ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరో గా నటించాడు. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీ కి కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమాను ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ రోజు అనగా ఫిబ్రవరి 25 వ తేదీన ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ ప్రీమియర్ షో బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనడంతో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని , ఏ స్థాయి కలక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk