సందీప్ కిషన్ ఆఖరి 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసు కుందాం.

మజాకా : సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా ... ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఊరు పేరు భైరవకోన : సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్లుగా నటించారు. వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ జరిగింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మైకల్ : సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 6.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

గల్లి రౌడీ : సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నేహా శెట్టి , సందీప్ కిషన్ కు జోడిగా నటించగా ... జి నాగేశ్వర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

A1 ఎక్స్ప్రెస్ : సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాకి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి , సందీప్ కిషన్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 4.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk