చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం రోజున దుబాయ్ లో దాయాదుల పోరు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పైన భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను చూడడానికి సినీ సెలబ్రిటీలందరూ దుబాయ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా మ్యాచ్ చూడడానికి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ఊర్వశి రౌతేలకు ఓ అభిమాని స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.


రెండు రోజులలో ఊర్వశి పుట్టినరోజు కావడంతో అక్కడికి కేక్ తీసుకుని వచ్చారు. ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే ఊర్వశి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ తరుణంలోనే కిక్కిరిసిన స్టేడియంలో డ్యాన్స్ తో ఊర్వశి అదరగొట్టింది. మరోవైపు ఈ బ్యూటీతో పాటు మరో వ్యక్తి కూడా డ్యాన్స్ చేశాడు. ఇద్దరు డాన్స్ చేస్తున్న సమయంలో ఊర్వశి రౌతేలకు ఆ వ్యక్తి సడన్ గా ముద్దు పెట్టాడు.


దీంతో ఆమె షాక్ అయినట్టుగా కనిపించింది. అయితే ఈ ఇద్దరూ చాలా సరదాగా కనిపించారు. కాగా, బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఊర్వశి రౌతేలకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్  - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఊర్వశికి సినిమాలో అవకాశం దొరికిందట.


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే షెడ్యూల్లో ఊర్వశి రౌతేల కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. కాగా, ఈ సినిమాలో ఊర్వశికి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కినట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాలో అవకాశం రావడంతో ఊర్వశి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: