
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది .. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో భారీ షెడ్యూల్ ను మొదలు పెట్టారు . ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ని ఎంపిక చేశారని తెలుస్తుంది .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు తన మాస్ స్పెషల్ డాన్సులతో బాగా దగ్గరయింది .. రీసెంట్ గానే బాలయ్య డాకు మహారాజ్ లో దబిడి దిబిడే పాట తో పాటు కొన్ని సీన్స్ లో కూడా నటించింది .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ , నీల్ సినిమాను ఓకే చేసింది . ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాత్రలకు హై ఇంటర్సిటీ ఉంటుంది ..
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఊర్వశి చేయబోయే పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంద ని తెలుస్తుంది .. సినిమా కు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారని తెలుస్తుంది .. 1969 నాటి చైనా - భూటాన్ - ఇండియా బోర్డర్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెస్తున్నారు .. అలాగే త్వరలో నే ఊర్వశి కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతోంది .. ఈ బాలీవుడ్ బ్యూటీ గ్లామర్ క్వీన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది .. డాన్సులు , గ్లామర్ మాత్రమే కాకుండా నటి గా నిరూపించుకోవాలని ఎంతో తపన పడుతుంది ఊర్వశి .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నిల్ లాంటి బిగ్గెస్ట్ సినిమాలో అవకాశం రావడం తన కేరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తుందని ఆమె భావిస్తుంది . ఇక మరి ఈ సినిమా ఊర్వశి కి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరికను ఎన్టీఆర్ ఈ సినిమాతో తీరుస్తారా లేదా చూడాలి .