టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది .. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు .. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమా సందీప్ కెరియర్ కు భారీ  హైప్ ఇస్తుంద‌న్న నమ్మకం కూడా ఉంది . తండ్రి కొడుకులు కథ .. ఇద్దరు తండ్రి కొడుకులు వేరువేరు అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న సబ్జెక్టుతో సినిమా వస్తుంది .. అయితే ఈ కథ ముందుగా చిరంజీవి దగ్గరకు వెళ్లిందట .


తండ్రిగా చిరంజీవి కొడుకుగా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ  ని కలిపి ఈ సినిమా చేయాలని భావించారట .. సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణకృష్ణ దర్శకుడుగా ఈ సినిమాను చిరంజీవితో చేయాలని భావించారు .. దాదాపు ఈ సినిమా ఓకే అవ్వాల్సిందే .. కానీ ఊహించిని విధంగా మధ్యలో ఆగిపోయింది ..  దాంతో చిరు అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డా .. చిరు , సిద్దు జొన్నలగడ్డ ఇద్దరూ కలిసి  నటిస్తే ఇద్దరూ చేసే ఫన్ చూడాలని ఎవరికీ ఉండదు ఆ ఛాన్స్ అలా మిస్సయింది. అయితే చిరు ఆ కథని వదిలేసి మంచి పని చేశాడని టాలీవుడ్ ఇన్సెట్ వర్గాల నుంచి వస్తున్న టాక్ .


 ఇక దీనికి కూడా ఒక కారణం ఉంది .. ఇందులో తండ్రి పాత్ర చిరు స్థాయిలో ఉందట .. ఇదే విషయాన్ని సందీప్ కిషన్ స్వయంగా కూడా చెప్పారు . దర్శకుడు త్రినాధరావు ఇదే మాట చెప్పారు .. ఇక ఈ కథ చిరంజీవి గారి దగ్గరికి పెళ్లిని మాట నిజం .. అయితే ఆయన వెర్షన్ ఎలాంటిదో నాకు తెలియదు రావు రమేష్ కి ఆయన వయసుకు తగ్గ పాత్ర ఇది .. ఎంతైనా చిరు ఇమేజ్ వేరు కదా ఆయన ముందు కథ చిన్నదైపోతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు దర్శకుడు .. అలాగే హీరో సందీప్ కిషన్ కూడా ఇదే మాట‌ చెప్పారు .కొన్ని కథలు చూడ్డానికి బాగుండొచ్చు కానీ ఇమేజ్ కి సరిపోవాలి. రావు రమేష్ పాత్రలో చిరంజీవిని ఊహించుకోలేం ..ఎవరు ఇమేజ్ వారిది .. చిరంజీవి కూడా అందుకే ఈ కథని పక్కన పెట్టేసారేమో అని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: