
అలాగే సినిమా చూడటం వల్ల మన బాధల్ని కూడా మర్చిపోవటమే కాకుండా మరో లోకానికి తీసుకువెళతాయి .. ఇదే క్రమంలో థియేటర్ బదులు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సినిమా రూపమే మారిపోయింది .. సినిమా ప్రపంచాలు దాటుతున్నప్పటికీ ఓ దేశంలో మాత్రం ఇప్పటికీ ఒక సినిమా ధియేటర్ కూడా లేదు .. మీరు వింటుంది నిజమే మన ప్రపంచంలో సినిమా ధియేటర్ లేని ఏకైక దేశం భూటాన్ .. ఈ దేశంలో సినిమా థియేటర్లు లేవు . ఇక్కడ సినిమాలు చూడాలంటే ప్రజలు టీవీలో లేదా ఆన్లైన్లో చూడాలి.
ఇక భూటాన్‌లో సినిమా ధియేటర్ లేకపోవడానికి కారణం ఏమిటంటే .. ఇక్కడ సంస్కృతి లో సినిమాలు సమాజం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఇక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు .. అందుకే ఇక్కడ సినిమాలు చూడడానికి ప్రత్యేక స్థలాలు ఉండవు .. అయితే భూటాన్ ప్రజలు మాత్రం సినిమాలు చూడటం ఆపలేదు .. వారు టీవీలో లేదా ఇంటర్నెట్లో సినిమాలు చూస్తూనే వస్తున్నారు .. భూటన్లో సినిమా థియేటర్లు లేకపోవటం వింతగా అనిపించిన .. కానీ ఇది ఆ దేశ సంస్కృతి లో ఒక భాగంగా వస్తుంది.