బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో షాహిద్ కపూర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈయన ఎక్కువ శాతం సౌత్ సినిమాలను రీమిక్ చేయడంలో ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ కి రీమిక్ గా రూపొందిన కబీర్ సింగ్ సినిమాలో హీరోగా నటించాడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో షాహిద్ కపూర్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. ఇక ఇలా తెలుగు మూవీ రీమేక్ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొంది తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జెర్సీ సినిమాని హిందీ లో రీమేక్ చేశాడు.

మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా షాహిద్ కపూర్ "దేవా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు వరకు ఈ మూవీమూవీ కి రీమేక్ అని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ ముంబై పోలీస్ మూవీ కి రీమేక్ అనే వార్తలు వైరల్ అయ్యాయి. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా సౌత్ సినిమాలను నమ్మి ఒక విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ రెండు అపజయాలను అందుకున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: