నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీరీస్ నుండి హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లు వచ్చాయి. ఈ రెండు మూవీలు మంచి విజయాలు సాధించడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నిన్న అనగా ఫిబ్రవరి 24 వ తేదీన హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి నుండి ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 17.12 మిలియన్ వ్యూస్ ... 353.3 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి 24 గంటల్లో అదిరిపోయి రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను బట్టి చూస్తే ఈ మూవీ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నాని ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో ఈ మూవీ పై నాని అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం నాని ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే నాని , శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో ది పారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: