హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ సరైన హిట్ లేక సతమతమైపోతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీ తరువాత సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోతగ్గ హిట్ లేదు. ఇలాంటి పరిస్థితులలో ‘మహాశివరాత్రి’ రోజున విడుదలకాబోతున్న ‘మజాక’ మూవీ పై ఈ యంగ్ హీరో చాల ఆశలు పెట్టుకున్నాడు.



అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం మూవీలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు నక్కిన త్రినాథ్ రావ్ గతంలో తీసిన ‘ధమాక’ మూవీ స్థాయిలో పూర్తి ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో సందీప్ కిషన్ తో సమానంగా రావ్ రమేష్ పాత్రను కామెడీ రచయిత ప్రసన్న కుమార్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈమధ్యకాలంలో కామెడీ సినిమాలకు మంచి కలక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై బాగా నమ్మకం పెట్టుకుని 9 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సందీప్ కిషన్ ప్రస్తుత మార్కెట్ రేంజ్ కు ఈ బిజినెస్ రేంజ్ చాల పెద్దది అని అంటున్నారు. నాగచైతన్య ‘తండేల్’ మూవీ తరువాత విడుదలైన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారడంతో ధియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.



దీనితో చూడటానికి సరైన సినిమా ప్రేక్షకులకు అందుబాటు లేని పరిస్థితులలో సందీప్ కిషన్ ‘మజాక’ దర్శకుడు నక్కిన శ్రీనాథ్ రావ్ కు అదేవిధంగా హీరో సందీప్ కిషన్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. సాధారణంగా కామెడీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తూ ఉంటారు. అయితే మార్చిలో పిల్లలకు పరీక్షల సీజన్ అవ్వడంతో ఎంతవరకు ఈ కామెడీ సినిమాను జనం ఆదరిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..






మరింత సమాచారం తెలుసుకోండి: