
కాగా ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సలార్ సినిమాకు సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి. అయితే సలార్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. వచ్చే నెల మార్చి 21వ తేదీన సలార్ సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దేవ తన డెన్ ఖాన్సార్ కి రిటర్న్ కాబోతున్నాడు.
మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన సలార్ సినిమా ఆ అంచనాలకు తగినట్టుగానే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోను ప్రేక్షకులను బాగా ఆకట్టుకోబోతోంది. ఇదిలా ఉండగా.... ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన సినిమాలలో స్పిరిట్ ఒకటి. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా స్పిరిట్ సినిమాను హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కీలక పాత్రలలో కనిపించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక రాసి కన్నా ఈ సినిమాలో నటిస్తుందని తెలియగానే తన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారట. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.