
ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. తదుపరి షెడ్యూల్ లో ఊర్వశి జాయిన్ కాబోతుందట. అంతేకాకుండా ఈ సినిమాలో టోవినో థామస్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కాబోతోంది. ఊర్వశి స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమా బంపర్ హిట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన భారీ చిత్రం వాల్తేరు వీరయ్యలో ఈ చిన్నది స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా, ఇన్నేళ్లుగా పలు చిత్రాలలో కేవలం ఊర్వశి ఐటమ్ గర్ల్ గా మాత్రమే కనిపించిన ఊర్వశి తెలుగులో తన డెబ్యు సినిమాతో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కాగా, వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్రేక్ అందించాడో అదే దర్శకుడు కొల్లి రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమాతో ఆమెని మరోసారి ఐటమ్ సాంగ్ కి మాత్రమే పరిమితం చేయకుండా నటిగా కూడా సినిమాలలో మంచి అవకాశాన్ని అందించారు.
కాగా, ఈ సినిమాలో ఊర్వశి మంచి రోల్ లో నటించిన కొన్ని విషయాలలో మాత్రం మేకర్స్ ఊర్వశిని పక్కన పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఊర్వశికి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడం విశేషం. కేవలం ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాలలో కీలక పాత్రలను కూడా పోషిస్తూ ఈ చిన్నది మంచి గుర్తింపును అందుకుంటుంది. దీంతో ఊర్వశి అభిమానులు సంబరపడుతున్నారు.