
అయితే అలాంటివి ఏమీ పట్టించుకోలేదు నిహారిక . తన పని తాను చూసుకుంటూ వెళుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా తన కెరీర్ లో ఏం కావాలి .. తన లైఫ్ ఎలా సెటిల్ అవ్వాలి అని తను అనుకున్నిందో.. అదే విధంగా ముందుకు వెళుతుంది . ప్రజెంట్ పలు సినిమాలల్లో నటిస్తూనే పలు వెబ్ సిరీస్ లను ప్రమోట్ కూడా చేస్తుంది. ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే నిహారిక కెరియర్ చాలా సూపర్ గా ప్లాన్ చేసుకుందట . కానీ మెగాఫ్యామిలీ నుండి ఆడపిల్ల ఇండస్ట్రీ లోకి రావడం ఎవరికీ ఇష్టం లేదు.
ఆ కారణంగానే ఆమె "ఒక మనసు" సినిమా కన్నా ముందే ఎన్నో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు వచ్చిన మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదట. ఫైనల్లీ నిహారికనే మొండి పట్టుదలగా భీష్మించుకొని కూర్చొని హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి మరి ఇండస్ట్రీలో "ఒక మనసు" సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ నిజంగా నిహారిక ఇప్పుడు చేసిన పని ముందే చేసుంటే ఎప్పుడో స్టార్ హీరోయిన్ గా మారిపోయి ఉండేది. ఇప్పుడు నేషనల్ క్రష్ ట్యాగ్ కూడా నిహారిక దక్కించుకునేది. ఆమె చాలా కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి . కానీ ఆ మెగా ట్యాగ్ నిహారిక కొంప ముంచింది అంటున్నారు జనాలు..!