ప్రశాంత్ నీల్.. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ . ఓ స్టార్ డైరెక్టర్ . ఆయన తెరకెక్కించింది చాలా తక్కువ సినిమాలే . కాని సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు . మరీ ముఖ్యంగా ప్రభాస్ తో సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి.. ఆయన కెరీర్ ని మార్చేసిందో అందరికీ తెలిసిందే . అంతకుముందు కే జి ఎఫ్ అయితే ప్రభంజనం సృష్టించింది . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటూ రాజమౌళికి బ్రదర్ అనే ట్యాగ్ ను కూడా దక్కించుకున్నాడు.


త్వరలోనే సలార్ 2 సినిమాను సెట్స్ పై కి తీసుకురాబోతున్నారు.  అంతేకాదు మరొకపక్క ఎన్టీఆర్ తో కమిట్ అయిన సినిమాలు కూడా సెట్స్  పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఇలా బ్యాక్ టు బ్యాక్ హీరోలతో సినిమాకి కమిట్ అయిన ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి చేరింది. గతంలో చిరంజీవి - రాంచరణ్ స్పెషల్ గా మీట్ అయి మరి ఆయన అనుకున్న స్టోరీని వినిపించారు . ఆ టైంలో చిరంజీవి - చరణ్ కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమాని హోల్డ్ లో పెట్టారు .



కాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో  ఆ సినిమాని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉండిపోయారు మెగా హీరోస్ . అందుతున్న సమాచారం ప్రకారం ఇది చిరంజీవి - రామ్ చరణ్ బిగ్ మల్టీస్టారర్ మూవీ గా తెరకెక్కబోతుందట. ప్రశాంత్ ఫుల్ బిజీ బిజీ . ఒకపక్క ప్రభాస్ మరొకపక్క ఎన్టీఆర్ వీళ్ళ సినిమాలతోనే టైం మొత్తం అయిపోతుంది . ఇక చరణ్ - చిరంజీవి లతో సినిమా ఓకే అయినా ఇప్పుడు అప్పట్లో తెరకెక్కించలేరు . మరి నాలుగేళ్లు చరణ్ - చిరంజీవిసినిమా కోసం వెయిట్ చేస్తారా..? అంటే నో అన్న ఆన్సర్ వినిపిస్తుంది . ఇప్పుడు చిరంజీవి కోసం ఏ హీరోని వదులుకోబోతున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అందరూ అందరికీ టాప్ హీరోసే.  ప్రభాస్ ని తక్కువ అంచనా వేయలేము. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను వదులుకోలేం .. చిరంజీవి - చరణ్ కాంబో తెరకెక్కించాలి  అంటే అదృష్టం ఉండాలి . ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేక అయోమయ సిచువేషన్ లో పడిపోయాడు ప్రశాంత్ నీల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: