సెలబ్రిటీల విడాకులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.తాజాగా బాలీవుడ్ నటుడు కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు నేషనల్ మీడియా పేర్కొంది. మరి ఇంతకీ విడాకులు తీసుకోబోతున్న ఆ హీరో ఎవరయ్యా అంటే గోవిందా..1980లో ఈయన హవా బాలీవుడ్ లో  మొదలైంది.. ముఖ్యంగా బాలీవుడ్ లో నటుడు గోవిందా కి హీరోగా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ వంటి హీరోలు కొనసాగుతున్న సమయంలోనే ఈయన తన కామెడీ సినిమాలతో అభిమానులను తన వైపు తిప్పుకున్నారు. అలాంటి నటుడు గోవిందా సునీత అహుజాని 1987లో పెళ్లి చేసుకున్నారు.అలా వీరి పెళ్లి జరిగి 38 ఏళ్లు అవుతుంది.కానీ 38 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఈ జంట గుడ్ బై చెప్పబోతున్నట్టు జాతీయ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే.. 1980లో హీరోగా రాణించిన ఈయన 1990లో కామెడీ హీరోగా మారిపోయి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయితే నటుడు గోవిందా అహుజా మొదట నటి నీలం కఠోరిని గాఢంగా ప్రేమించారు.కానీ వారి పెళ్లి జరగలేదు. ఆ తర్వాత 1987లో సునీతని పెళ్లి చేసుకున్నారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా వీరి సంసారంలో ఎలాంటి గొడవలు లేకుండా వీరి కాపురం సజావుగా సాగింది. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య తరచూ విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో గోవిందా అహుజా,సునీత అహుజా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోవడం బెటర్ అని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా సునీత అహుజా ఓ ఇంటర్వ్యూలో కూడా చాలా రోజుల నుండి మేమిద్దరం విడివిడిగానే ఉంటున్నాం అంటూ చెప్పింది. దీంతో సునీత గోవింద మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని, అందుకే ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారని ఆమె మాటలతో అర్థమైంది.ఇక వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం గోవిందా మరాఠీ నటితో ఎఫైర్ పెట్టుకోవడమేనని తెలుస్తోంది.వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే సునీత గోవింద మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని తెలుస్తోంది.మరి నిజంగానే గోవింద సునీత విడిపోతున్నారా..వీరి విడాకులు నిజమేనా అనేది తెలియాలంటే వాళ్లు క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: