
మరీ ముఖ్యంగా విక్కీ కౌశల్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి . అయితే అంతకుముందు వరకు చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే సినిమాలపై తెలుగు హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ అసలు ఇంట్రెస్ట్చూపించే వాళ్ళు కాదు. ఇప్పుడు "ఛావ" సినిమా పుణ్యమా అంటూ అందరూ కూడా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్స్ కు అలాంటి ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని తీసుకురండి అంటూ పలువురు పాన్ ఇండియా స్టార్స్ సజెస్ట్ చేస్తున్నారట .
మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలు కూడా అదే విధంగా డైరెక్టర్స్ కు హిస్టారికల్ నేపథ్యంలో ఉన్న సినిమాలను చేద్దామంటూ సజెషన్స్ ఇస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో పాన్ ఇండియా అనేది పాతబడిపోయింది అని.. కొత్త ట్రెండ్ హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలను ముందుకు తీసుకెళ్లాలి అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ చూస్తున్నారు అని జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు . చరిత్రలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు .. వాళ్ళ జీవిత ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తే ఆ సినిమాలు బాగా హిట్ అవ్వడంతో పాటు జనాలు వాళ్లకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటారు అని పలువురు పెద్ద వ్యక్తులు సజెస్ట్ చేస్తున్నారు..!