తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగబాబు. మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా హీరోగా కూడా చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక తండ్రి పాత్రలో నాగబాబు చెరగని ముద్ర వేసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. చివరగా నాగబాబు విజయ్ దేవరకొండ హీరో గా నటించిన గీతా గోవిందం సినిమాలో తండ్రిగా నటించి మెప్పించాడు. అంతేకాకుండా నిర్మాతగానూ పలు మూవీస్ తెరకెక్కించారు. కానీ గత కొద్ది రోజులు నుంచి ఇండస్ట్రీకి దూరం అయి రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరో అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు మాత్రమే. ఆయనకి ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేదు. ఇక అందంలో ఆయనకి పోటీ ఇచ్చే మగాడు కూడా లేరు. నా భార్య మహేష్ బాబుకు పెద్ద అభిమాని. తన తమ్ముడిగా భావిస్తుంది. చిన్నతనంలో మహేష్ బాగా లావుగా ఉండేవాడు.. సన్నగా నాజూగ్గా మారేందుకు అతను చాలా కష్టపడేవాడు.హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నాన్‌స్టాప్‌గా పరుగెత్తుతూ ఉండేవాడు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు నిద్రపోని గుణం మహేష్ బాబులో ఉంది. ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందం, ఫేమ్ విషయంలో ఆయనను బీట్ చేసే వారు లేరు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా మహేష్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, సూపర్ స్టార్ సినిమాల విషయానికొస్తే..ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. రాజమోళి ఈ చిత్రంలో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: