పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో తనను అధిగమించే హీరో భవిష్యత్తులో కనపడటంలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తాజాగా విడుదలైన కల్కి చిత్రం దాదాపు రూ.1100 కోట్లు వసూలు చేసింది.ఇక డార్లింగ్ నుంచి త్వరలోనే రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 చిత్రాలు రాబోతున్నాయి. ప్రతి ఆరునెలలకు ఒక సినిమా విడుదల చేస్తూ పాన్ ఇండియా హీరోగా తన మార్కెట్ సుస్థిరం చేసుకున్నారు.ఇదిలావుండగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్.ప్రభాస్ పేరుతో చెరగని రికార్డ్స్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్నీ ఓ తెలుగు బ్లాగర్ బయట పెట్టాడు. వివరాలలోకెళితే

‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. కానీ అది ఇండియాలో కాదు.భారతదేశానికి పోరుగు దేశమైన నేపాల్ లో ప్రభాస్ పేరుతో చిన్న పట్టణం ఉంది. తెలుగు వాడైనా ఓ మోటో బ్లాగర్ నేపాల్ పర్యటన చేస్తున్నాడు. రైడ్ లో బైక్ పై వెళుతుండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో వెంటనే ఓ వీడియో చేసి డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ సోషల్ మీడియా లో వీడియో షేర్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లిల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ పేరుతో ఊరు ఉందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ ఊరికి మొదటి నుండి ప్రభాస్ పేరు ఉందని సమాచారం.అయితే ఈ ఊరికి, ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.కాగా ప్రభాస్ కు ఇండియాతో పాటు నేపాల్ లోను భారీ ఫాలోయింగ్ ఉంది. రెబల్ స్టార్ గత సినిమాలైనా బాహుబలి, ఆదిపురుష్, సలార్. కల్కి సినిమాలు నేపాల్ మార్కెట్ లో భారీ వసూళ్లు రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: