
మహేష్ బాబు ఎంత సింపుల్ సిటీగా ఉంటారు రిల్ లైఫ్ లోనే కాకుండా రీయల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటూ ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ మహేష్ క్రేజ్ గురించి తెలియజేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సమానంగా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మహేష్ బాబు మాత్రమే అని తనకు ఉన్నంత లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మరి హీరోకి కూడా లేరని తెలియజేశారు. ఈ విషయంలో మహేష్ బాబుకి పోటీపడే హీరో కూడా లేరని వెల్లడించారు మహేష్ బాబు.
నాగబాబు భార్య కూడా మహేష్ కి పెద్ద ఫ్యాన్ అని మహేష్ ని తమ్ముడిలా ఫీలవుతూ ఉంటుందని వెల్లడించారు. మహేష్ బాబు చిన్నప్పుడు చాలా బొద్దుగా అందంగా ఉండే వారిని అప్పట్నుంచి తన లుక్స్ మార్చుకోవడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. చిన్న వయసులోనే మహేష్ బాబు స్లిమ్ముగా అవ్వడం కోసం కేబీఆర్ పార్కులో విపరీతంగా పరిగెత్తే వారు అనుకున్నది సాధించేవరకు తన ప్రయత్నాన్ని మాత్రం అసలు విడవరని తెలియజేశారు. మహేష్ బాబు లో ఆ క్వాలిటీ తనకు బాగా నచ్చుతుందని వెల్లడించారు నాగబాబు. ఒక వైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా నాగబాబు బిజీగానే ఉన్నారు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలను తీసుకున్నారు నాగబాబు.