పవన్ కళ్యాణ్ హీరోగా ,డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన చిత్రం హరిహర వీరమల్లు.. అయితే కొంతమేరకు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మరొక డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం మిగిలిన భాగాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చే నెల 28వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించడం జరిగింది. సరిగ్గా  30 రోజులలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావడం లేదు.. వాస్తవానికి ఇప్పటికే మొదటి కాపీ కూడా పూర్తి అవ్వాలి అలాగే సెన్సార్ పనులను కూడా పూర్తి చేసి ఉండాలి.


అవేవి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక ఐదు రోజులపాటు తన డేట్లు కేటాయిస్తేనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యా అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం నిర్మాతలు కూడా కల్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఓజి సినిమా కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలకే తన సమయాన్ని కేటాయించడానికి సరిపోతోందట.


మరి దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల 28వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు కూడా నమ్మడం లేదు.. అలాగే కొత్త డైరెక్టర్ని ఈ సినిమాకి తీసుకోవడంతో కూడా కొంతమంది భిన్నంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మార్చి 28న నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా  రిలీజ్ కాబోతున్నది దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా హరిహర వీరమల్ల సినిమా మాత్రం ఆ డేట్ కి వచ్చేలా కనిపించడం లేదు. వీటన్నికి తోడు మ్యాడ్ స్క్వేర్  సినిమా కూడా అదే రోజుకి రిలీజ్ చేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ కి పోటీగా ఈ సినిమాలను రిలీజ్ చేస్తారు అంటే ఎవరు నమ్మడం లేదు. మరి చిత్ర బృందం వీటన్నిటి పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: