
అయితే బోనీ కపూర్ ప్రెజెంట్ తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన పెద్ద కూతురు జాన్వి కపూర్ ని ఇండస్ట్రీలో సెటిల్ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు . ఆల్రెడీ :దేవర" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయింది . అయితే రామ్ చరణ్ సినిమాతో ఆమె కెరియర్ వేరే స్థాయిలోకి వెళ్లబోతుంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. బోనికపూర్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు . కాగా రీసెంట్ గా ఒక పిక్చర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది .
ఆర్సి 16 టీం అంతా కలిసి ఒక ఫోటో దిగారు . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అలాగే టైటిల్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీ రిలీజ్ చేయబోతున్నారు . అయితే ఈ క్రమంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ ఫోటోలు అందరూ చాలా పద్ధతిగా కూర్చుని ఉంటే బోనీ కపూర్ మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. పక్కనే ఉన్న బుచ్చిబాబు సనా చేతులు కట్టుకొని వినయంగా.. ఆ పక్కనే ఉన్న జాన్వీ కపూర్ - రాంచరణ్ - సుకుమార్ చాలా సింపుల్ లుక్స్ లో ఆకట్టుకోగా.. వెనకాల సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పద్ధతిగా ఉంటారు. కానీ బోనికపూర్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఫీల్ అవుతూ ఫోటోకి ఫోజులిచ్చారు. ఇక్కడే సోషల్ మీడియాలో జనాలకు దొరికిపోయాడు బోనీ కపూర్ . కళ్ళు నెత్తికెక్కాయా.. ఎంత పెద్ద స్టేటస్ ఉన్నా ఒక ఫోటో దిగేటప్పుడు పద్ధతి పాడు అంటూ ఒకటి ఉంటది .. నీకు ఆ రెండు లేనట్టు ఉన్నాయి అంటూ దారుణతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!