తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది .. అక్కడ రాజకీయాలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి . ముగ్గురు అగ్ర హీరోల వైఖరి ఇందుకు ముఖ్య కారణం .. సూపర్ స్టార్ రజినీకాంత్ , లోక నాయకుడు కమలహాసన్ , దళపతి విజయ్ .. ఈ ముగ్గురు ఒక్కోదారిలో ఉండటం ఇప్పుడు అక్కడ రాజకీయాలు ఇంట్రెస్ట్ గా మారడానికి ప్రధాన కారణమన్న టాక్‌ వినిపిస్తుంది .. తమిళనాడు రాజకీయాలను చిత్ర పరిశ్రమను వేరు చేసి చూడలే .. దశాబ్దాలుగా అక్కడ రుజువైన అనుభవాలు ఎన్నో .. డీఎంకే ని దశాబ్దాలుగా బలమైన పార్టీగా నడిపిన శక్తిగా చెప్పబడే దివంగత కరుణానిధి మొదలు అంతటి కరుణానిధితో విభేదించి సోంత పార్టీని స్థాపించి విజయం సాధించిన అప్పటి అగ్ర హీరో ఎం.జి రామచంద్రన్ .. కీలక బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజిఆర్ మరణం తర్వాత పార్టీని వంటి చేత్తో నడిపించి దశాబ్దాన్నరకి పైగా పార్టీని సక్సెస్ చేయగలిగారు .. ఆ తర్వాత మరో తమిళ్ అగ్ర హీరో విజయ్ కాంత్ కూడా పార్టీని పెట్టి కొంతమేర ప్రభావతం చూపించగలిగారు .. అయితే దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నేరుగా రాజకీయాల్లో వస్తారని బలమైన చర్చ జరిగిన ఆయన మాత్రం రాజకీయాల్లోకి రాలేదు.


అయితే 90వ దశంలో డిఎంకెకి రజినీకాంత్ మద్దతు ఇచ్చిన సమయంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది .. 2011లో రజినీకాంత్ ఏడీఎంకేకి ఓటు వేసిన‌ ఆయన వీడియోలు నిమిషాల్లో వైరల్ గా మారాయి .. ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో ఆయన మద్దతు జయలలిత నేతత్వంలో పార్టీకి ఇచ్చారన్న సంకేతాలు కూడా వచ్చాయి .. అయితే రాజకీయంగా జయలలిత , రజనీకాంత్  ఎప్పుడు విభేదాలు ఉండేవి .. అలాగే ఇద్దరి మధ్య చెప్పలేనంత వైరం కూడా ఉండేది .. ఇది తమిళనాడు మొత్తం తెలిసిన విషయమే .. ఇక 2017లో రజనీకాంత్ రాజకీయాల్లో ఎంట్రీ దాదాపు ఖాయమని వార్తలు వచ్చాయి. అభిమానులతో వారస సమావేశాలు కూడా జరిపారు .. కానీ ఊహించిన విధంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించిన విషయం కూడా చూసాం. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రావటం లేదన్న ప్రకటన తర్వాత విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని చర్చ ఉప్పందుకుంది .. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం కూడా జరిగింది .. దళపతి విజయ్ ఏర్పాటు చేసిన టీవీ కే ఇప్పుడు సొంతంగా ఓ కూటమని ఏర్పాటు చేస్తుందా లేకా ఉన్న బలమైన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీలు చేస్తుందా అన్నది ప్రజెంట్ క్లారిటీ లేదు .. కానీ ఇప్పుడు మొత్తానికైతే మాత్రం రాజకీయాల్లో తానేంటో చూపించుకోవాలని కసితో మాత్రం విజయ్ రాజకీయం చేస్తున్నట్టుగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి.


విజయ్ కంటే ముందే పార్టీని స్థాపించిన కమలహాసన్ 2021లో పోటీ చేసి ఇలాంటి సత్తా చూపించలేకపోయాడు .. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం డీఎంకే కూటమికి కమలహాసన్ మద్దతు ఇచ్చారు . డీఎంకే గత పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది .. కమలహాసన్ కు డీఎంకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తొలి స్థానం కమల్ కు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది .. ఇక దీంతో డిఎంకెకి కమలహాసన్ దగ్గరిగా ఉండటం అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. మరో హీరో రజనీకాంత్ ఒకప్పుడు డిఎంకెకి మద్దతు ఇవ్వటం ఆ తర్వాత తాను వేసిన ఓటు ద్వారా జయలలిత పార్టీకిమద్దతుగా ఉన్నానన్న సంకేతాలు ఇవ్వటం ఒక్కసారిగా తీవ్ర హాట్ టాపిక్ గా మారాయి .. ఈ రెండిటికి మించి ప్రధాని నరేంద్ర మోడీతో రజనీకాంత్ కు మంచి సానుహిత్యం ఉంది .. ప్రజెంట్ తమిళనాడులో జయలలిత మరణం తర్వాత మూడు ముక్కలుగా చీలిపోయిన ఏడిఎంకే ని ఒక తాటిపైకి తెచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ఎలాగైనా తమిళనాడులో అధికారం దక్కించుకోవాలని బిజెపి ప్లాన్ గా ఉంది. ఇలా తమిళనాడులో ఉన్న ముగ్గురు అగ్ర హీరోలు తలో దిక్కుగా ఉంటున్న క్రమంలో తాజా పరిణామాలు ఇటు తమిళనాడులోను అటు జాతీయ రాజకీయాల్లోను ఎంతో హాట్ టాపిక్ గా మారాయి. మరి ముగ్గుర హీరోలు  వచ్చే తమిళనాడు ఎన్నికల్లో ఏ హీరో ఎలాంటి ప్రభావం  చూపిస్తారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: