మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది .. ఆయన స్వయంకృషితో పైకి వచ్చిన వారు ఒంటరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కుని ఇండియన్ సినిమాలోనే నెంబర్ వన్ గా నిలిచారు .. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి చాలామంది హీరోలు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మెగా బ్రాండ్ ను అంతకంత‌కు పెంచుతూ పోతున్నారు . ఇదె క్రమంలో ఈ కుటుంబానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

చిరంజీవి తండ్రి కొనిదెల వెంకటరావు ఈయనకు సంబంధించిన ప‌లు ఆసక్తికర విషయాలు రామ్ చరణ్ ప‌లు ఇంటర్వ్యూలో చెప్పారు .. చరణ్ మాట్లాడుతూ తాతయ్యకు సినిమాల్లో నటించాలని ఎంతో ఆసక్తి ఉండేదని  నాన్నమ్మ చెప్పింది. కానీ ఆయనకు అది కుదరకపోవడంతో చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారట .. అయితే డాడీని మాత్రం చాలా ప్రోత్సహించాడట .. ఇక తాతయ్య చివరగా నా సినిమానే చూశారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే నేను చేసిన మొదటి మూవీ చిరుత రిలీజ్ అయింది .


ఈ సినిమాను తాతయ్య థియేటర్లో చూసి ఎంతో సంతోషపడ్డారు .. నాకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .. ఇక తర్వాత తాతయ్య వీల్ చేరికే పరిమితం కావడంతో ఆయన సినిమాలు చూడలేదు .. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక నానమ్మ నా అన్ని సినిమాలు చూసింది ముఖ్యంగా నేను డాడీతో కలిసి చేసిన ఆచార్య సినిమాను నానమ్మ చూసి ఎంతో ఆనందపడింది. ఇద్దరినీ ఓకే సారీ చూడటం నాన్నమ్మకు ఎంతో ఇష్టమంటూ చెప్పుకోవచ్చురు . అయితే చరణ్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: