పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు మనదేశంలో కాదు ఇతర దేశాల్లో క్రేజ్‌ కూడా ఊహించిన రేంజ్ లో ఉంది . ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రభాస్ పేరట అభిమాన సంఘాలు చేసే కార్యక్రమాలు ఆయనకున్న క్రేజ్‌ను చాటి చెబుతున్నాయి .. అలాగే మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ బ్యాంకాక్ , లండన్ మ్యూజియంలో మొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రభాస్ స్థానం దక్కించుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే .. బాహుబలి సినిమాలోని అమరేంద్ర బాహుబలి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.


అలాగే పలు స్టేడియంలకు , రైల్వే స్టేషన్లకు ప్రముఖుల పేర్లు పెట్టడం కూడా మనం చూస్తుంటాం .. ఇప్పటికే సచిన్ , కోహ్లీ పేరిట రైల్వే స్టేషన్లో కూడా ఉన్నాయి .. అలాగే కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లతో జిల్లాలు , పట్నాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు .. అయితే ఇప్పుడు మాన  పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ పేరట మన పరుగు దేశం నేపాల్ లో ఏకంగా ఒక సిటీ ఉందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఓ ప్రముఖ ట్రావెలర్ నేపాల్ లో పర్యటన చేస్తున్న సమయంలో అతనికి ప్రభాస్ పేరుతో ఓ చిన్న ఊరు కనిపించింది .. వెంటనే అతను ఆనందంతో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.


ఇంకేముంది అదికాస్తా ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది .. అయితే ఆ సిటీకి ఎప్పటినుంచో ప్రభాస్ పేరుతోనే పిలుస్తున్నారట.. ఇలా ప్రభాస్ పేరుతో సిటీ వీడియో వైరల్ అయిన తీరు ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనం అంటూ ఆయన అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అలాగే ప్రభాస్ కు జపాన్ , చైనా , అమెరికా లాగానే నేపాల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు .. బాహుబలి , సలార్ క‌ల్కి   సినిమాలు నేపాల్ లో భారీ కలెక్షన్లు సాధించాయి . ఇప్పుడు ప్రభాస్ నటించిన రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ సినిమాల పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: