
సింగింగ్ కెరీర్ 2018 లో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమాతో మొదలుపెట్టింది బ్రింద. నిర్మాత జి. ధనంజయన్‌కు శివకుమార్ అగరం ఫౌండేషన్ ఈవెంట్ వీడియో ఒకటి షేర్ చేశారట. అందులో బ్రింద వాయిస్ విని, ఆయన ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. వెంటనే తన సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇచ్చేశారు. అంతే, అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ టాలెంటెడ్ సింగర్.
'రాక్షసి', 'జాక్‌పాట్', 'పొన్మగళ్ వందాల్', 'O2' లాంటి సినిమాల్లో తన మధురమైన గొంతుతో పాటలు పాడింది. అందులో 'పొన్మగళ్ వందాల్' సినిమాలో 'వా చెల్లం' పాట ఎంత హిట్ అయిందో ఆ భాష వారు అడిగితే చెబుతారు. ఆ పాట పాడింది బ్రిందనే. ఇంకా విశేషం ఏంటంటే.. ఆ సినిమాలో హీరోయిన్ జ్యోతిక అంటే బ్రింద వదిన, అంటే ఫ్యామిలీ హీరోయిన్‌కే పాట పాడేసింది అన్నమాట. ఈ సాంగ్ తో బ్రిందకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇంకో విషయం ఏంటంటే, బ్రిందకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందట. కానీ ఆమె మాత్రం యాక్టింగ్ వద్దు బాబోయ్ అనుకుందట. మ్యూజిక్ అంటేనే తనకి పిచ్చి అని డిసైడ్ అయిపోయింది. ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా చాలా కాలం లైమ్ లైట్‌కి దూరంగా ఉండిపోయింది ఈ అమ్మడు.
సింగింగ్ మాత్రమే కాదు, డబ్బింగ్ కూడా చెప్పి అదరగొడుతోంది బ్రింద. రీసెంట్‌గా 'బ్రహ్మాస్త్ర' సినిమాలో అలియా భట్ కి డబ్బింగ్ చెప్పింది. మల్టీ టాలెంటెడ్ అంతే. సూర్య, కార్తీలు ఒక దారిలో వెళ్తే.. బ్రింద మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ రూట్ ని ఎంచుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సో.. బ్రింద శివకుమార్.. టాలీవుడ్ కి దొరికిన మరో మణిరత్నం. ఇంకా చాలా దూరం వెళ్తుంది ఈ అమ్మాయి.