యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మన ఇండియాలో కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పేరు చెబితేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగునాటనే కాదు, ఇప్పుడు ఆ క్రేజ్ జపాన్ దాకా వెళ్లింది. 'RRR' సినిమాతో జపాన్‌లో ఎన్టీఆర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అక్కడి ప్రేక్షకులు తారక్‌ను ఒక దేవుడిలా కొలుస్తారు. మళ్లీ ఇప్పుడు 'దేవర' సినిమాతో జపాన్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యాడు మన టాలీవుడ్ టాప్ హీరో.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా మార్చి 28న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నాడు. మార్చి 22న ఎన్టీఆర్ జపాన్ చేరుకోనున్నాడు. అక్కడ గ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొంటాడు. ఇప్పటికే జపనీస్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. జూమ్ మీటింగ్ ద్వారా జపనీస్ జర్నలిస్టులతో మాట్లాడాడు. 'దేవర' సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'RRR' సినిమా రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ జపాన్ వెళ్లినప్పుడు అక్కడి ఫ్యాన్స్ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ టైమ్ నుంచి ఎన్టీఆర్‌కు జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ అభిమానులంతా 'దేవర' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మళ్లీ జపాన్ వస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

'దేవర పార్ట్ 1' ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా. కొరటాల శివ ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తాడు. అతని సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళి శర్మ, నారాయణ్, జరీనా వహాబ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు.

గతేడాది సెప్టెంబర్ 27న 'దేవర పార్ట్ 1' థియేటర్లలో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు జపాన్‌లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం కొరటాల శివ 'దేవర పార్ట్ 2' స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: