
ఆషికా రంగనాథ్ 5 ఆగస్టు 1996న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో ఓ హిందూ కుటుంబంలో ఆషికా రంగనాథ్ జన్మించింది. రంగనాథ్ మరియు సుధా రంగనాథ్ ఈమె తల్లిదండ్రులు. ఈమెకు అనూష రంగనాథ్ అనే సోదరి కూడా ఉంది. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ కోసం ఆషికా రంగనాథ్ ఆడిషన్ కి వెళ్ళింది. మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్ గా నిలిచింది. ఫ్రీ స్టైల్ బెల్లీ మరియు వెస్ట్రన్ తో సహా వివిధ డ్యాన్స్ స్టైల్స్ లో కూడా శిక్షణ పొందింది.
దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి క్రేజీ బాయ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. సైమా ద్వారా హీరోయిన్ గా ఉత్తమ డెబ్యూ అవార్డుకు ఆషికా రంగనాథ్ ఎంపికైంది. అనంతరం కొన్ని సినిమాలలో నటించింది. ఇదిలా ఉండగా ఈ భామ అందానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే ఆషికా రంగనాథ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
ఆషిక టాలీవుడ్ లో ఉన్న ఓ హీరోతో పీకల్లోకి ప్రేమలో మునిగి తేలుతోందట. అంతేకాకుండా ఆ హీరోతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. త్వరలోనే వీరు ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. మరి వీరి వివాహం పెళ్లి పీటల వరకు వెళుతుందా లేదా అనే సందేహంలో కొంతమంది ఉన్నారు. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.