టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంతసినిమా అనంతరం వరస పెట్టి సినిమాలలో నటించి అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంతకు వరుసగా సినిమా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సైతం క్యూ కట్టారు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఈ బ్యూటీ ఆడి పాడింది.

 కాగా, సమంత సినిమాలలో నటిస్తున్న సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట కేవలం నాలుగు సంవత్సరాల పాటు కలిసున్న అనంతరం విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు నాగచైతన్య రూ. 200 కోట్ల వరకు భరణం కింద ఆఫర్ చేసినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ డబ్బులు తీసుకోవడానికి సమంత అసలు ఒప్పుకోలేదట.

ఎలాంటి భరణం లేకుండానే నాగచైతన్యకు విడాకులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇదే విషయం గురించి మరో వార్త తాజాగా తెలుగులోకి వచ్చింది. సమంత విడాకుల సమయంలో నాగచైతన్య వద్ద మొదట డబ్బులు తీసుకోవడానికి నిరాకరించి అనంతరం 200 కోట్ల రూపాయలు భరణం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.

 ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఈ విషయం పైన సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, విడాకుల తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం ఇప్పటి సింగిల్ గానే ఉంటుంది. త్వరలోనే సమంత కూడా వివాహం చేసుకోబోతుంది అంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: