
అసలు విషయంలోకి వెళ్తే..న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి నిర్వహించిన ఒక ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దు అంటూ మాధవి లత, యామిని వంటి వారు చెప్పడంతో ఒక్కసారిగా జెసి వర్గాలు బగ్గుమన్నాయి. ఆమె పైన బూతులతో కూడా జేసి రెచ్చిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా అంతటితో ఈ వివాదం ముగియకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరుల పైన కూడా మాధవి లత ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా తాడిపత్రిలో BNS సెక్షన్ 353 1-B కింద కేసు నమోదు చేయడం జరిగిందట దీంతో మరొకసారి మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి వివాదం మొదటికే వచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూలో టిడిపి బిజెపి నేతల మధ్య కూడా మాటల ఉద్యమం నడుస్తూ ఉన్నది. మరి చివరికి ఈ వ్యవహారం ఎక్కడ వరకు చేరుకుంటుందో చూడాలి.