రామ్ చరణ్ ..ఒక బిగ్ పడా స్టార్ . తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే రామ్ చరణ్ పేరు చెప్తే అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది . మెగా ఫ్యాన్స్ పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతారు. ఆఫ్ కోర్స్ తండ్రి పెద్ద స్టార్ హీరో.. మెగాస్టార్ కానీ రామ్ చరణ్ తన సినిమాల విషయంలో మాత్రం మెగాస్టార్ ను పెద్దగా వాడుకోలేదు.  సొంత తెలివితేటలతో సొంత టాలెంట్ తో ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వచ్చాడు . కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ పేరే మారు మ్రోగిపోతుంది . దానికి కారణం రామ్ చరణ్ కమిట్ అయిన మూవీల లిస్ట్.


బ్యాక్ టు బ్యాక్ బడాబడా దర్శకులతో సినిమాకి కమిట్ అయ్యాడు.  ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్ . ఈ సినిమా అయిపోక ముందే రాంచరణ్ - సుకుమార్ సినిమాను సెట్స్ పైకి  తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ బయటపడింది . కాగా ఇలాంటి క్రమంలోనే ఉపాసన మనసులోని కోరిక బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .



ఉపాసనకి - రామ్ చరణ్ నటించిన సినిమాలు అన్ని ఇష్టమే . ఆయన నటన బాగుంటుంది అంటూ చెప్పుకొస్తుంది.  అయితే ఉపాసన - రాంచరణ్ ని నెగిటివ్ షేడ్స్ లో చూడాలి అనుకుంటుందట . ఇండస్ట్రీలో నటుడుగా గుర్తింపు రావాలి అంటే అన్ని షేడ్స్ లో నటించాలి. ఇప్పటివరకు హీరో గా తన టాలెంట్ చూపించిన రామ్ చరణ్ ఒక్క సినిమాలోనైనా నెగిటివ్ షేడ్స్ చేసి సక్సెస్ అయితే కచ్చితంగా ఒక నటుడిగా ఫుల్ ఫీల్ అయిపోయినట్లే అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఉపాసన కోరికను రామ్ చరణ్ ఎప్పుడు తీరుస్తాడో..? అలాంటి డైరెక్టర్ ఎక్కడున్నాడో..? కాలమే సమాధానం చెబుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: