
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా ప్రభాస్ తన ఖాతాలో ఎంతమంది బడా దర్శకులను లైన్ లో వేచి పెట్టేలా చేసుకున్నాడు అందరికీ తెలుసు . అలాంటి ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్స్ కోసం స్వయంగా రంగంలోకి దిగబోతున్నారట. ఆ సినిమా మరేంటో కాదు "ఘాటి". యస్ అనుష్క శెట్టి నటిస్తున్న "ఘాటి". ఈ సినిమాను ప్రభాస్ ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాడట . అదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ - అనుష్కల మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
ఇలాంటి మూమెంట్లో అనుష్క "ఘాటి" సినిమా ప్రమోషన్స్ కోసం స్వయంగా ప్రభాస్ రాబోతున్నాడు అని ఒక వార్త బాగా వైరల్ కావడం సంచలనంగా మారింది. అదే నిజమైతే మాత్రం నో డౌట్ వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అన్న మాట వాస్తవమే అని ఫిక్స్ అయిపోవాల్సి వస్తుంది అంటున్నారు జనాలు . అయితే కొంతమంది సెటైరికల్ గా సినిమా టైటిల్స్ తో ప్రభాస్ - అనుష్కలను ఆడేసుకుంటున్నారు . "ప్రియురాలు పిలిచిందా బాస్" అంటూ అనుష్క అదే విధంగా ప్రభాస్ ను ఒకటిగా చేసి మాట్లాడేస్తున్నారు . "ఘాటీ" సినిమాకి ప్రభాస్ ప్రమోషన్స్ నిర్వహిస్తే మాత్రం నో డౌట్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . ఈ సినిమాలో ఎప్పుడూ లేనంత వైలెంట్ గా కనిపించబోతుంది అనుష్క శెట్టి..!