
సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజలకి ఖర్చు పెట్టడం రెబల్ ఫ్యామిలీ స్పెషాలిటీ . అప్పట్లో కృష్ణంరాజు ఇప్పుడు ప్రభాస్ ఇద్దరు కూడా అంతే . ప్రభాస్ ఏ సినిమా షూటింగ్ జరిగిన సరే ఆ షూటింగ్ సెట్స్ లో ఉన్న అందరికీ కూడా స్వయాన ప్రభాస్ ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు వెళ్తాయి . ఈ విషయాన్ని చాలామంది స్టార్స్ ఓపెన్ గానే చెప్పారు. ప్రభాస్తో వేగడం మామూలు విషయం కాదు.. ప్రభాస్ తో ఉంటే డైట్ కంట్రోల్ చేయలేం అన్న కామెంట్స్ కూడా వినిపించాయి .
అయితే అలాంటి ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు అని ఆనందపడే లోపే మరో షాకింగ్ న్యూస్ బయటపడ్డింది. ఒకటి కాదు రెండు కాదు ఖాతాలో ఆరడజనులకు పైగాని పాన్ ఇండియా సినిమాలు వేసుకొని ఫుల్ బిజీ బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు ప్రభాస్. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ప్రభాస్ అన్ని సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ చేసేసుకున్నారట . అంతేకాదు ఆయన పది రోజులపాటు ఏ సినిమా షూటింగ్ కి అటెండ్ అవ్వలేను అంటూ తేల్చి చెప్పేసారట. కాల్ షీట్స్ మొత్తం రీషెడ్యూల్ చేయాలి అంటూ ఫిక్స్ చేసేసారట . అయితే ప్రభాస్ మోకాళ్ళ గాయం మళ్ళీ తిరగబడింది అన్న కారణంగానే ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ప్రభాస్ లేదా ప్రభాస్ టీమ్ స్పందించాల్సిందే..!