
స్టొరీ:
సందీప్ కిషన్ (కృష్ణ), రావు రమేష్ (రమణ) తండ్రి కొడుకులుగా నటించారు.. కృష్ణ పుట్టినప్పుడే అతని తల్లి మరణించడంతో ఇంట్లో రమణ, కృష్ణ మాత్రమే పెరుగుతూ ఉంటారు. వీరికి కూడా ఒక కుటుంబం ఉండాలని వీరి ఇంట్లోకి ఒక అమ్మాయి రావాలని.. రమణ తన కుమారుడైన కృష్ణ కి సంబంధాలు చూస్తూ ఉంటారు. అయితే అలాంటి సమయంలోనే ఆడ తోడు లేని ఇంటికి పిల్లని ఇవ్వమంటూ చెబుతూ ఉంటారట.. దీంతో రమణ తనకి పెళ్లయితే తన కుమారుడు కృష్ణకు కూడా సంబంధాలు వస్తాయని ఆలోచనతో ఉంటారు. అలాంటి సమయంలోనే రమణ యశోద (అన్షు అంబానీ) చూసి మరి ప్రేమిస్తారు.. ఇక కృష్ణ కూడా మీరా (రీతు వర్మ) ప్రేమిస్తూ ఉంటారు.. చివరికి వీరిద్దరి ప్రేమలో సక్సెస్ అయ్యాయా లేదా అనేది ఈ సినిమా కథ.
మొదటి భాగం సందీప్ కిషన్, రావు రమేష్ తను నటనతో అద్భుతంగా ప్రేక్షకులను నవ్వించారట. హీరోయిన్స్ రీతు వర్మ, అన్షు అంబానీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారట. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తోందట. అయితే సెకండ్ హాఫ్ లో కొంతమేరకు బోరింగ్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. చివరిలో కామెడీతో ఈ సినిమాని ఆకట్టుకున్నారు.
సందీప్ కిషన్ ఎప్పటిలాగే తన నటనతో అందరిని ఆకట్టుకున్నారని ,రావు రమేష్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది.. రీతు వర్మ కూడా తన నటనతో కమర్షియల్ డాన్సులతో పర్వాలేదు అనిపించుకుంది. అన్షు అంబానీ రీ ఎంట్రీ ఆకట్టుకున్నదని నేటిజన్స్ తెలుపుతున్నారు.
పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయట. యూట్యూబ్ సాంగ్ మాత్రం పరవాలేదు అనిపించుకుంది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వర్కౌట్ కాలేదట.
మొత్తానికి మజాకా సినిమా ఒక మంచి పాయింట్ కామెడీ సినిమా అని ఆడియన్స్ తెలుపుతున్నారు. మరి సందీప్ కిషన్ మజాకా మూవీ పూర్తి రివ్యూ మరి కొన్ని గంటలలో తెలియబోతోంది.