ప్రభాస్ .. ఇతను ఓ రెబల్ హీరో..ఇతను ఓ పాన్ ఇండియా హీరో..ఇతను ఓ బిగ్ బడా స్టార్ హీరో.. ఇలా పిలవడం కన్నా..ప్రభాస్ ఓ మంచి మనిషి. నలుగురికి అన్నం పెడతాడు. దబ్బు సహాయం కన్నా ఆకలి సహాయం చేస్తాడు. ఆ విషయంలో ఎప్పుడు రాజే. ఇలా మాట్లాడుకుంటూ ఉండటానికి ఇష్టపడతారు జనాలు. ప్రభాస్ చాలా చాలా సైలెంట్ పర్సన్ . పేరుకి పెద్ద పాన్ ఇండియా స్టార్. వేల కోట్ల ఆస్తికి అధిపతుడు.


కానీ సింపుల్ లుక్స్ లో ఆకట్టుకుంటూ ఉంటాడు . తన లైఫ్ స్టైల్ మొత్తం కూడా సింపుల్ గానే ఉంటుంది . ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సరే చాలా సింపుల్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . అలాంటి ప్రభాస్ తన కెరీర్లు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు.  మరీ ముఖ్యంగా ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు,  మంచి మంచి పాటలు ఆయన ఖాతాలో పడిన ప్రభాస్ ఫేవరెట్ సాంగ్ మాత్రం "చక్రం" సినిమాలోని "జగమంత కుటుంబం" అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు .


ప్రభాస్ చాలా చాలా నార్మల్గానే ఉండడానికి ఇష్టపడుతుంటాడు . ఒకానొక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయనకు "చక్రం" సినిమాలోని "జగమంత కుటుంబం" సాంగ్ అంటే చాలా చాలా ఇష్టమని ఆ సాంగ్ ఇప్పటికీ వింటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది అని .. తన మొబైల్ లో ఎక్కువగా వినే పాట కూడా అదే అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అప్పట్లో ఈ పాటను ఎక్కువగా వినడానికి లైక్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ప్రభాస్ పాన్  ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్లిపోతున్నాడు . మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమాతో బాక్సాఫీస్ హిస్టరీ తిరగరాయబోతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడు . ఈ సినిమా కోసం ఫ్యాన్ వెయిటింగ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: