తమన్నా ఈ మధ్య కాలంలో ఎక్కడపడితే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు  కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.కానీ సడన్ గా బాయ్ ఫ్రెండ్ తో కాకుండా మరో హీరోతో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. మరి ఇంతకీ తమన్నా ఏ హీరోతో కనిపించిందయ్యా అంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ తో తమన్నా భాటియా స్విమ్మింగ్ ఫూల్ లో రచ్చ రచ్చ చేస్తున్నట్టు సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఒకరికి ఒకరు చాక్లెట్ పూసుకొని ఒంటి నిండా చాక్లెట్ తో వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో చాలామంది ఈ ఫోటోలు చూసి ఇదేంటి తమన్నా సల్మాన్ ఖాన్ లు ఇలా ఒకరికొకరు చాక్లెట్ పూసుకొని స్విమ్మింగ్ ఫూల్ లో కనిపించారు అని షాక్ అయిపోతున్నారు.

అయితే విచిత్రం ఏమిటంటే.. అవి నిజమైన ఫోటోలు కాదు. అవి ఏఐ ఫోటోలు మాత్రమే.తమన్నా భాటియా సల్మాన్ ఖాన్ ఇద్దరు చాక్లెట్ పూసుకుని తింటున్నట్టు ఏఐ ఫోటోలు క్రియేట్ చేశారు. ఈ ఫోటోను చూస్తే ఏఐ ఫోటోలని క్లారిటీ గా అర్థమవుతుంది. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లకు సంబంధించి ఇలాంటి ఫొటోస్ క్రియేట్ చేశారు.

బికినీ లో ప్రభాస్, మృణాల్ ఠాగూర్ ఇద్దరూ కలిసి సముద్రం లో కలిసి రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోలను లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఏఐ ఫొటోస్ కూడా క్రియేట్ చేశారు.అలాగే జాన్వి కపూర్ కి సంబంధించిన ఫొటోస్ కూడా ఇలాగే క్రియేట్ చేశారు.ఏఐ అందుబాటులోకి వచ్చాక సెలబ్రెటీల పై ఇలాంటి ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సల్మాన్ ఖాన్ తమన్నాలకు సంబంధించిన ఏఐ ఫొటోస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: