
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు మంచి స్పందన రావడంతో నాని అభిమానులు జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు సక్సస్ అవ్వాలి అంటే హింస ఎలిమెంట్ బాగా ఎక్కువగా ఉంటేనే యూత్ ధియేటర్లకు వస్తున్నారు. ఈ ట్రెండ్ నాని దృష్టి వరకు రావడంతో ‘హిట్ 3’ లో ఈ మాషాలా అంశాలు బాగా దట్టించినట్లు లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ లోని సీన్స్ ను బట్టి సినిమా అభిమానులకు అర్థం అవుతోంది.
వాస్తవానికి ‘దసరా’ మూవీతో నాని బాలీవుడ్ మార్కెట్ ను కార్నర్ చేయాలని చాల గట్టిగా ప్రయత్నించాడు. అయితే ఈసినిమా దక్షిణాది రాష్ట్రాలలో బాగానే ఆడింది కానీ హిందీ బెల్ట్ లో ఈ మూవీ అంతంత మాత్రంగానే సక్సస్ అవ్వడంతో ప్రస్తుతం నాని ఆశలు అన్నీ ‘హిట్ 3’ పైనే ఉన్నాయి. దర్శకుడు శైలేష్ కొలను ఈమూవీని చాల విభిన్నంగా తీశాడాని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.
ఈసినిమాను మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే మే 1న సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన ‘రెట్రో’ విడుదల కాబోతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈమూవీ ఉంటుందని తమిళనాడు మీడియా వార్తలు వ్రాస్తోంది. అయితే అదే డేట్ కు తాను రాబోతున్నాము అంటూ సూర్య ప్రకటన ఇవ్వడంతో నాని సూర్యా కు పోటీగా పాన్ ఇండియా స్థాయిలో నిలబడగలడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..