శివరాత్రి వచ్చింది అంటే దేశమంతట శివనామస్మరణతో ఊగిపోతుంది.. దేశమంతా భక్తులు శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.. ఆరోజు దగ్గరలో వున్న శివాలయాలు అన్ని భక్తులతో కిక్కిరిసిపోతాయి.. భక్తులు ఉదయాన్నే నిద్ర లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.. శివరాత్రికి భక్తులు చేసే పూజా కార్యక్రమాలలో జాగరణ కార్యక్రమం ఎంతో ముఖ్యమైంది..శివరాత్రి సందర్బంగా భక్తులంతా ఆ రోజంతా ఉపవాసం ఉండి శివరాత్రి జాగరణ పూర్తి చేసి మరునాడు ఉపవాసాన్ని విడుస్తారు.. అయితే జాగరణలో భాగంగా భక్తులంతా ఆ రాత్రి అంతా శివయ్య సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ భక్తి పారవస్యంతో మునిగితేలుతుంటారు..

అయితే జాగరణలో భాగంగా భక్తులు చూసే సినిమాలలో అంజి సినిమా ముఖ్యంగా ఉంటుంది..మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా 'అంజి'.ఆత్మలింగం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించగా నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు..

అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్ కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు..’అంజి’ సినిమాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.అంజి సినిమాకు ఖర్చు విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు.. 

ఈ సినిమాలో చిరంజీవి కొత్త ఆర్టిస్టు మాదిరిగానే ఆయన కష్టపడ్డారని కోడి రామకృష్ణ తెలిపారు.. ‘అంజి’ సినిమా అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా చెప్పుకొవచ్చు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పని చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా కూడా మేము ఈ సినిమా కోసం పడిన తపన ఎలాంటిది అనేది ఇండస్ట్రీలో వాళ్లు అందరికీ తెలుసు’’అని కోడి రామకృష్ణ ఆ వీడియో లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: