చాలామంది హీరోలు చాలా రకాల పాత్రలు చేసి ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అయితే అలా మెగాస్టార్ చిరంజీవి కూడా నేను ఇప్పటివరకు అన్ని పాత్రల్లో చేశాను.కానీ దేవుడి పాత్రలో నటించలేదు అనే కోరిక చాలా రోజుల నుండి ఉందట. అలా తన కోరికలు నెరవేర్చుకోవడానికి తన ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరైనటువంటి రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడు పాత్రలో నటించి అదరగొట్టారు. అయితే శివుడి గెటప్ లో చిరంజీవి అద్భుతంగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకి శివుడి పాత్రలో నటించిన చిరంజీవే మైనస్ అయ్యారట. చిరంజీవి వల్ల ఈ సినిమా ప్లాఫ్ అయిందని అప్పట్లో చాలా మంది గగ్గోలు పెట్టారు. మరి సినిమా ప్లాప్ అవ్వడానికి చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.. దేవుడి  పాత్రలో నటించడానికి చిరంజీవి చాలా రోజుల నుండి ఆశపడ్డారట. 

అలా చివరికి శ్రీ మంజునాథ సినిమాలో శివుడి పాత్రలో చేసే అవకాశం వచ్చింది.అయితే ఈ సినిమాలో చిరంజీవి నటించినప్పుడు ఆయన స్టార్ట్డం అడుగడుగునా అడ్డుపడిందట.. అయినా కూడా రాఘవేంద్రరావు సినిమాని పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో శివుడు పాత్రలో నటించిన చిరంజీవి పార్వతి దేవి ఇద్దరు నాట్యం చేయడం ముందుగా లేదట. కానీ ఆ తర్వాత చిరంజీవి అభిమానులను ఖుషి చేయడం కోసమే రాఘవేందర్రావు ఈ సినిమాలో బలవంతంగా శివపార్వతుల నాట్యం పెట్టారట.కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం శివపార్వతుల నాట్యాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారట. ఇక శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడు గా నటించాడు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఇమేజ్ ని బట్టి సినిమా హిట్ అవుతుందని చాలామంది బయ్యర్లు ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాని కొనుగోలు చేశారట.

కానీ చివరికి చిరంజీవే సినిమాకి మైనస్ అయ్యి బయ్యర్లకు నష్టాలు మిగిల్చారట. చిరంజీవి కోరిక తీరలేదు చిరంజీవిని నమ్మి కొనుగోలు చేసిన బయ్యర్లు మునిగిపోయారట. ఇక 2001లో వచ్చిన శ్రీ మంజునాథ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాలో శివుని భక్తులుగా అర్జున్ సార్జా, సౌందర్యలు కనిపించారు.మొదట అర్జున్ సార్జాకి శివుడి మీద నమ్మకం ఉండదు. కానీ సౌందర్య మాత్రం శివ భక్తురాలు. ఆ తర్వాత అర్జున్ కూడా శివుడు మీద భక్తి కలిగి ఇద్దరూ శివ భక్త పారావశ్యంలో మునిగిపోయినట్టు కనిపిస్తారు. ఇక శివరాత్రి వచ్చిందంటే కచ్చితంగా బుల్లితెర మీద శ్రీ మంజునాథ సినిమాని చాలామంది ఇష్టంగా చూస్తారు

మరింత సమాచారం తెలుసుకోండి: